Sagar ragaS

అవును… పాట అంటే నాకు ప్రాణం… ఊపిరి
ప్రతి మనిషి జీవితంలో ఒక మంచి మిత్రుడు ఉంటాడు. నాకు మిత్రుడు నా గుండె లోతుల నుంచి పుట్టే పాటే.
నాలో కలిగే ప్రతి భావాన్నీ విని, నాతో పంచుకుంది నా పాటే.. సంతోషం కలిగినా, బాధ తాకినా, ఆలోచనలలో మునిగినా, అలసటతో నిద్రపోయినా, పట్టుదలతో ముందుకి నడిచినా … ప్రతి క్షణంలోనూ నా పాటే నా పక్కన నిలిచింది.
ఇబ్బందులు ఎదురైనప్పుడు నా పాటే నాకు ధైర్యం ఇస్తుంది, ఒంటరితనం వెంటాడినప్పుడు నా పాటే నాకు తోడుగా నిలిచింది, నాలోని భయాన్ని నిశ్శబ్దంగా నా పాటే చెరిపేసింది.
నేను ఒంటరిగా నడిచినా నా పాట నా అడుగులకు తోడుగా వస్తుంది. నాతోనే నా పాట ఎదిగింది.
జీవితంలో అర్థ భాగం గడిచిపోయినా…. నా గళానికి వృద్ధాప్యం రాలేదని ఇంకా ఎన్నో కొత్త స్వరాలూ నాలో ఉన్నాయని… పాడవలసిన కలల పాటలు మిగిలి ఉన్నాయని మనసు గుర్తు చేస్తోంది.
అందుకే మళ్లీ పాడుతున్నాను…
పాట… నా ఊపిరి. పాట… నా జ్ఞాపకం. పాట… నా జీవితం. పాటే నా సర్వస్వమ్.
అయితే నేనూ కొంత స్వార్ధ జీవినే… అందుకే నే పాడే ఈ పాట నాకు మాత్రమే సొంతం… అంకితం.
Latest Videos from my Youtube Channel Sagar ragaS -avs